కోడలు పిల్లతో పని చేయడం అద్భుతంగా, సరదాగా ఉంది: నాగ్

  • రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’
  • సామ్‌తో తీసుకున్న ఫొటోను షేర్ చేసిన నాగ్
  • మరిన్ని ఫొటోలు విడుదల కాబోతున్నాయంటూ ట్వీట్
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మధుడు 2’. మన్మథుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సెట్‌లో నాగ్‌ తన కోడలు సామ్‌తో తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

‘‘మన్మథుడు 2’ కోసం కోడలు పిల్ల సమంతతో కలిసి పనిచేయడం అద్భుతంగా, సరదాగా ఉంది. మరిన్ని ఫొటోలు విడుదల కాబోతున్నాయి’ అంటూ నాగ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలో కారుకు ఆనుకుని తనకు, నాగ్‌కు గొడుగు పట్టుకుని సామ్ కనిపించింది. ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఫొటోను కూడా చిత్రబృందం నేడు విడుదల చేసింది. ఇటీవల పోర్చుగల్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే మరో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది.
Go Back to Shorts
Manmadhudu 2
Nagarjuna
Samantha
Rakul Preeth
Rahul Ravindran

More Telugu News